నిజంనిప్పులాంటిది

Mar 28 2024, 17:19

ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌ లో కెసిఆర్ ను కలిసిన కే.కేశవరావు

పార్టీ మారుతారనే ఊహా గానాలు జోరందుకున్న వేళ బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ కేశవరావు కేసీఆర్‌తో భేటీ అయ్యారు.

కాసేసటి క్రితమే ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌ను కలిశారు కేశవరావు. కేసీఆర్‌తో భేటీలో పార్టీ మార్పుపై కేకే వివరణ ఇచ్చినట్టు తెలుస్తోంది.

ఇప్పటికే కాంగ్రెస్‌లో చేరికకు కేకే కూతురు మేయర్ విజయలక్ష్మి రంగం సిద్ధం చేసుకుందనే వార్తలు రాగా.. కాంగ్రెస్ ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ కేకేను పార్టీలోకి ఆహ్వానించారు.

దాంతో ఆయన పార్టీ మారుతారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేప థ్యంలో కేసీఆర్‌ను కేకే కలవడం చర్చనీయంగా మారింది. మరోవైపు సోషల్ మీడియాలో కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఇటీవల వ్యాఖ్యలు చేశారు కేకే.

నిజంనిప్పులాంటిది

Mar 28 2024, 17:18

కొడంగల్ లో ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం రేవంత్ రెడ్డి

మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్ని క పోలింగ్ సందర్భంగా.. స్వయంగా ఊరు వెళ్లి ఓటు హక్కు వినియోగించుకు న్నారు సీఎం రేవంత్ రెడ్డి.

మొత్తం ఒక వెయ్యి 439 మంది ఓటర్ల కోసం.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 10 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు అధికారులు.

కొడంగల్ ఎంపీడీవో ఆఫీసులో సీఎం రేవంత్ రెడ్డి, కొల్లూపూర్ లో మంత్రి జూపల్లి కృష్ణారావు తమ ఓటు హక్కు వినియోగించు కున్నారు.

మధ్యాహ్నం 2 గంటల వరకు 89 శాతం పోలింగ్ నమోదైంది. సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగియ నుంది.

లోకల్ బాడీ బైపోల్స్ లో కాంగ్రెస్ పార్టీ నుంచి మన్నె జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నుంచి నవీన్ కుమార్ రెడ్డి తోపాటు స్వతంత్ర అభ్యర్థి గా సుదర్శన్ గౌడ్ బరిలో ఉన్నారు..

నిజంనిప్పులాంటిది

Mar 28 2024, 17:17

హైదరాబాద్ లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్థిగా స్టార్ క్రీడాకారుని సానియా మీర్జా?

టెన్నిస్ స్టార్ సానియా మీర్జా పోలిటికల్ ఎంట్రీ ఇవ్వను న్నారనే ఓ చర్చజరుగు తుంది అయితే పోలిటికల్ సర్కిల్‌లో వైరల్ అవుతోంది. ఈ ఎన్నికల్లో హైదరాబాద్ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆమె బరిలో దిగనున్నారనే ప్రచారం సర్కిల్‌లో సాగుతోంది.

హైదరాబాద్ లోక్‌సభ స్థానం ఎంఐఎం పార్టీకి కంచుకోట అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో అసదుద్దీన్ ఓవైసీకి ప్రత్యర్థిగా సాని యాను బరిలో దింపాలని కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇంకోవైపు లోక్‌సభ ఎన్నిక లకు గడువు సమీపిస్తోంది. ఇప్పటికే పలువురు ఎంపీ అభ్యర్థులను కాంగ్రెస పార్టీ ఎంపిక చేసి ప్రకటించింది. మరికొన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఆ క్రమంలో అభ్య ర్థుల ఎంపిక కోసం.. న్యూఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ బుధవారం సమావేశమైంది.

ఈ సమావేశంలో హైదరా బాద్ లోక్‌సభ అభ్యర్థి పేరు ఖరారు చేసే అవకాశం ఉందని సమాచారం. ఇక తన రాజకీయ రంగ ప్రవే శంపై సానియా మిర్జా కానీ ఆమె తండ్రి ఇమ్రాన్ మిర్జా కానీ ఎటువంటి ప్రకటన అయితే ఇప్పటి వరకు చేయలేదు.

దీంతో హైదరాబాద్ లోక్‌సభ అభ్యర్థి ఎవరనే అంశంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తి రేపుతోంది. మరోవైపు హైదరాబాద్ లోక్‌సభ బీజేపీ అభ్యర్థిగా మాధవీ లత పేరును ఆ పార్టీ అగ్రనా యకత్వం ఇప్పటికే ప్రకటించింది.

ఈ సారి ఎలాగైనా హైదరా బాద్‌ లోక్‌సభ స్థానాన్ని తమ ఖాతాలో వేసుకో వాలని బీజేపీ నాయకత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఆ క్రమంలో పాతబస్తీతో పలు సామాజిక సేవా కార్యక్రమా లు చేపడుతోన్న మాధవి లత పేరును బీజేపీ తమ పార్టీ అభ్యర్థిగా ఖరారు చేసిన విషయం విధితమే.

హైదరాబాద్ లోక్‌సభ స్థానాన్ని పలు దశాబ్దాలుగా ఎంఐఎం పార్టీ కైవసం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. హైదరాబాద్ ఎంపీగా ఎంఐఎం పార్టీ వ్యవస్థాపక అద్యక్షుడు సలావుద్దీన్ ఓవైసీ, ఆ తర్వాత ఆయన పెద్ద కుమారుడు అసదుద్దీన్ ఓవైసీ వరుసగా గెలుస్తూ వస్తున్నారు.

దీంతో ఆ పార్టీకి ఈ నియో జకవర్గానికి కంచుకోటగా మారింది. అలాంటి వేళ హైదరాబాద్‌ లోక్‌సభ స్థానాన్ని కైవసం చేసుకో నేందుకు బీజేపీ అగ్రనా యకత్వం సైతం మాధవి లతను బరిలో దింపి వ్యూ హాత్మకంగా అడుగులు వేసింది.

అలాంటి వేళ ఈ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ సైతం బలమైన అభ్యర్థిని రంగం లోకి దింపే అవకాశాలు ఉన్నాయని.. దాంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంపికపై తీవ్ర కసరత్తు జరుగుతోందనే ఓ చర్చ సైతం పోలిటికల్ సర్కిల్‌లో ప్రచారం జరుగుతోంది.

అలాంటి సమయంలో సానియా మిర్జాను రంగం లోకి దింపే అవకాశాలు మెండుగా ఉన్నాయనే ఓ చర్చ సైతం సాగుతోంది. అదీకాక సానియా మిర్జాకి కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయ కురాలు సోనియా గాంధీతో సన్నిహిత సంబంధాలున్న సంగతి అందరికీ తెలిసిందే

నిజంనిప్పులాంటిది

Mar 28 2024, 17:16

ఆ హంతకులకు, జగన్‌కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత

హైదరాబాద్‌: హంతకులకు ఓటు వేయవద్దని మాజీ మంత్రి వివేకా కుమార్తె సునీత మరోమారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ హైకోర్టు వద్ద గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు..

వై.ఎస్‌.వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి సీఎం జగన్‌ ప్రొద్దుటూరు సభలో చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు.

''చిన్నాన్న అంటే అర్థం తెలుసా? నాన్న తర్వాత నాన్న.. అలాంటి వ్యక్తిని చంపితే కుట్రను ఛేదించలేదు. పైగా.. చిన్నాన్న కుమార్తెపైనే నిందలు వేయడం న్యాయమా? మీ చెల్లి కోర్టులు, పోలీసుల చుట్టూ తిరుగుతుంటే అన్నగా మీ బాధ్యత ఏంటి? బంధుత్వాలకు అర్థం తెలుసా? చిన్నాన్నను ఎవరు చంపారో దేవుడికి తెలుసు, జిల్లా ప్రజలకు తెలుసు అంటున్నారు. అవును మీరు నిజమే చెప్పారు. వివేకాను చంపించింది ఎవరో.. దేవుడికి, మీకు, జిల్లా ప్రజలకు తెలుసు. అందుకే నిందితులను అంత బాగా రక్షిస్తున్నారు.

హంతకుడే చెబుతున్నాడు.. వైఎస్‌ భాస్కర్‌రెడ్డి, అవినాష్‌రెడ్డే వివేకాను హత్య చేయించారని. ఒకరు చెప్పింది నమ్ముతున్నారు.. ఇంకొకరు చెప్పింది నమ్మడం లేదు. ఐదేళ్లు మీ ప్రభుత్వం ఉండి కూడా ఏం చేశారు? నిందితులను రక్షించేది మీరు కాదా? గతంలో సీబీఐ విచారణ కోరింది మీరే.. ఆ తర్వాత పిటిషన్‌ ఉపసంహరించుకున్నదీ మీరే. ఎన్నికలు వస్తున్నాయని ఐదేళ్ల తర్వాత చిన్నాన్న గుర్తొచ్చారా? మీరు చేయాల్సిన పని సరిగా చేయనందుకే బయటకు రావాల్సి వచ్చింది. ఎవరు స్వార్థపరులు? ఎవరు పదవుల కోసం హత్య కేసును వాడుకుంటున్నారు.

హంతకులకు ఓటు వేయమని మీరు అడుగుతున్నారు. సినిమాలో రౌడీలు ఉంటారు, విలన్‌ ఉంటాడు. కేవలం రౌడీలను పట్టుకుంటే సరిపోతుందా? విలన్‌ను కూడా పట్టుకోవాలి కదా. చిన్నాన్న చనిపోయి ఐదేళ్లు అవుతోంది. సానుభూతి పొంది ఎన్నికల్లో ఓట్ల కోసం పాకులాడుతున్నారు. తండ్రిని కోల్పోయి నేను న్యాయం కోసం పోరాడుతున్నా. హంతకులకు ఓటు వేయవద్దని మరోసారి ప్రజలను కోరుతున్నా. పదవుల కోసమని నాపై ఆరోపణలు చేస్తున్నారు. న్యాయం కోసం, ధర్మం కోసం నేను పోరాడుతున్నా. సానుభూతి కోసమే ఎన్నికల వేళ చిన్నాన్నను జగన్‌ తెరపైకి తెస్తున్నారు. వైకాపా పునాదులు వివేకా రక్తంలో మునిగి ఉన్నాయి'' అని సునీత ఆవేదన వ్యక్తం చేశారు..

నిజంనిప్పులాంటిది

Mar 28 2024, 17:15

రౌస్ అవెన్యూ కోర్టులో సొంతంగా వాదనలు వినిపిస్తున్న కేజ్రీవాల్..

నన్ను ఇరికించడమే ఈడీ లక్ష్యం..

సీబీఐ 31 వేల పేజీలు,ఈడీ 25 వేల పేజీలతో ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు..

ఎక్కడ కూడా నా పేరు లేదు..

మాగుంట రాఘవరెడ్డి ఇచ్చిన 7 స్టేట్‌మెంట్లలో ఆరు స్టేట్‌మెంట్లలో నా పేరు లేదు..

ఢిల్లీ లిక్కర్ కేసులో 100 కోట్ల అవినీతి జరిగిందని చెప్తున్నారు..

100 కోట్లు ఎక్కడికి పోయాయి..

శరత్‌ చంద్రా రెడ్డి అరెస్ట్ అయిన తర్వాత రూ.55 కోట్లు బీజేపీకి డొనేషన్ ఇచ్చాడు..

ఈడీకి రెండు లక్ష్యాలు ఉన్నాయి..

ఒకటి కేజ్రీవాల్ ను ఇరికించడం, రెండవది ఆప్ పార్టీని లేకుండా చేయడం.

నాపై ఎటువంటి కేసు లేదు. -కేజ్రీవాల్

నిజంనిప్పులాంటిది

Mar 28 2024, 17:12

రాజకీయ ఒత్తిళ్లతో న్యాయవ్యవస్థకు ముప్పు.. సీజేఐకి 600 మంది లాయర్ల లేఖ

దిల్లీ: దేశంలో న్యాయవ్యవస్థ సమగ్రతను దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని పలువురు న్యాయవాదులు ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా రాజకీయ నేతలకు సంబంధించిన కేసుల్లో కోర్టు తీర్పులను ప్రభావితం చేసేందుకు కొన్ని స్వార్థమూకలు ఒత్తిడి వ్యూహాలను అమలు చేస్తున్నాయని ఆరోపించారు..

ఈ మేరకు ప్రముఖ న్యాయవాదులు హరీశ్‌ సాల్వే, పింకీ ఆనంద్‌ సహా 600 మందికి పైగా లాయర్లు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌కు లేఖ రాశారు. లోక్‌సభ ఎన్నికల వేళ ఇది చర్చనీయాంశంగా మారింది.

''పొలిటికల్‌ అజెండాతో స్వార్థ ప్రయోజనాలను ఆశించే కొన్ని గ్రూప్‌లు న్యాయవ్యవస్థపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. న్యాయపరమైన ప్రక్రియలను ప్రభావితం చేసి, కోర్టు ప్రతిష్ఠను దెబ్బతీయాలని చూస్తున్నాయి. ఇందుకోసం వారు అనేక మార్గాలను అనుసరిస్తున్నారు. కోర్టులపై ప్రజల్లో విశ్వాసాన్ని తగ్గించేందుకు న్యాయస్థానాల కీలక తీర్పులపై తప్పుడు కథనాలు సృష్టిస్తున్నారు. ఈ మధ్య కొందరు న్యాయవాదులు పగలు రాజకీయ నాయకులను సమర్థించడం, రాత్రి మీడియాతో న్యాయమూర్తులను ప్రభావితం చేయడం వంటి అంశాలు బాధాకరం'' అని లాయర్లు ఆందోళన వ్యక్తం చేశారు.

''రాజకీయ నాయకులు కొందరిపై అవినీతి ఆరోపణలు చేయడం.. ఆ తర్వాత వారినే కోర్టుల్లో సమర్థించడం వింతగా ఉంది. కోర్టు నిర్ణయాలు తమకు అనుకూలంగా రాకపోతే వెంటనే బహిరంగ విమర్శలకు దిగుతున్నారు. సోషల్‌ మీడియాలో అవాస్తవాలను ప్రచారం చేస్తూ న్యాయమూర్తులపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. వ్యక్తిగత, రాజకీయ కారణాలతో కోర్టు ప్రతిష్ఠను దెబ్బతీసే ఇలాంటి ప్రయత్నాలను ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించకూడదు. ఇలాంటి వాటిపై మౌనంగా ఉంటే.. హాని చేయాలనుకునేవారికి మరింత బలం ఇచ్చినట్లే. న్యాయస్థానాల కోసం నిలబడాల్సిన సమయం ఆసన్నమైంది. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టును కోరుతున్నాం'' అని న్యాయవాదులు తమ లేఖలో కోరారు..

నిజంనిప్పులాంటిది

Mar 28 2024, 14:31

హైకోర్టులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు ఊరట

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు హైకో ర్టు లో ఊరట లభించింది. కేజ్రీవాల్ ను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలి అని వేసిన పిల్ ను తిరస్క రించింది ఢిల్లీ హై కోర్టు.

సీఎం పదవి నుంచి కేజ్రీవాల్ ను తొలగించాలని పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. ఈ సందర్భంగా న్యాయపర మైన జోక్యానికి అవకాశం లేదని హై కోర్టు వెల్లడిం చింది.

జైల్లో నుంచి ప్రభుత్వాన్ని నడపడంలో చట్టపరమైన అడ్డంకులు లేవని పేర్కొంది ఢిల్లీ హైకోర్టు. దీంతో కేజ్రీవాల్ కు హైకోర్టులో ఊరట లభించింది.

పిటిషన్ డిస్మిస్ చేసిన ఢిల్లీ హైకోర్టు…కేజ్రీవాల్ ను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలి అని వేసిన పిల్ ను తిరస్కరించింది..

నిజంనిప్పులాంటిది

Mar 28 2024, 12:09

88 స్థానాలకు రెండో విడుత ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల

సార్వత్రిక సమరంలో రెండో విడుత ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. సుదీర్ఘంగా సాగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో ఇప్పటికే మొదటి విడుత నామినేషన్ల గుడువు ముగిసింది.

గురువారం ఉదయం రెండో దశ ఎన్నికల్లో భాగంగా 88 స్థానాలకు నోటిఫికేషన్‌ను ఈసీ విడుదల చేసింది. వెంటనే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది.

రెండో విడుతలో ఔటర్‌ మణిపూర్‌లోని ఒక సీటు తోపాటు దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని ఎంపీ స్థానాల్లో ఏప్రిల్‌ 26న పోలింగ్‌ జరుగనుంది.

ఏప్రిల్‌ 4 వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. జమ్ము కశ్మీర్‌ మినహా 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన నామినేషన్ల పరిశీలన ఏప్రిల్‌ 5న జరుగనుంది.

జమ్మలో మాత్రం ఏప్రిల్‌ 6న నామపత్రాలను పరిశీలించ నున్నారు. రెండో విడతలో అస్సాం, బీహార్, ఛత్తీస్‌గఢ్, జమ్ముకశ్మీర్, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్తాన్, త్రిపుర, ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మణిపూర్‌లో ఎన్నికలు జరుగనున్నాయి.

వీటితోపాటు మహారాష్ట్ర లోని అకోలా పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గం, రాజస్తాన్‌లోని భాగిడోరా అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరుగుతాయి.

కాగా, మొదటి విడుత నోటిఫికేషన్‌ను మార్చి 20న విడుదల చేసిన విషయం తెలిసిందే. మొత్తం 102 ఎంపీ స్థానాలకు ఏప్రిల్‌ 19న ఎన్నికలు జరుగనున్నాయి...

నిజంనిప్పులాంటిది

Mar 28 2024, 11:25

జనగాం ఏసీపీ పై ఈసీ వేటు

ఎన్నికల కోడ్ ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండగా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న జనగాం ఏసీపీ దామోదర్ రెడ్డి మీద ఈసీ వేటు వేసింది.

నిబంధనల మేరకు డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది...

Streetbuzz News

*SB NEWS*

Streetbuzz news

నిజంనిప్పులాంటిది

Mar 28 2024, 11:23

ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం:ముగ్గురు మహిళలు మృతి

ప్రకాశం జిల్లాలో బుధవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.

టంగుటూరు మండలం సూరారెడ్డిపాలెం వద్ద డివైడర్‌ను కారు ఢీకొట్టింది.

ఈ ఘటనలో అక్కడికక్కడే ముగ్గురు మహిళలు మృతి చెందారు.

మరో ఇద్దరికి తీవ్రగాయాలు కాగా.. వారిని హుటాహు టిన ఆస్పత్రికి తరలించారు. ఖమ్మం జిల్లా పాల్వంచ నుంచి కందుకూరు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

ఓ వివాహ కార్యక్రమానికి హాజరై తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలిసింది..